తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ తన అందమైన చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక హీరోయిన్గా ఎన్నో చిలిపి పాత్రల్లో నటించి ఇంట్లో అమ్మాయి లాగా అందరికీ ఒక భావన కలిగించింది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది అని చెప్పాలి. బాయ్స్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది మాత్రం తెలుగు ఇండస్ట్రీనే కావడం గమనార్హం. ముఖ్యంగా జెనీలియా హీరోయిన్ గా వచ్చిన బొమ్మరిల్లు సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా ద్వారా హాసినిగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది జెనీలియా.


 ఈ క్రమంలోనే జెనీలియా కు వస్తున్న ఆఫర్లు చుస్తే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ కావడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో జెనీలియా కెరియర్ ముగిసిపోయింది అని చెప్పాలి. అయితే జెనీలియా కెరియర్ మొదట్లో ఒక స్టార్ హీరో కొడుకుతో చాలా క్లోజ్గా మూవ్ అయినట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక వీరి మధ్య ఉన్న చనువు చూసి తప్పకుండా పెళ్లి చేసుకుంటారని కూడా ఎంతో మంది భావించారు. అయితే జెనీలియా అతన్ని ఒక స్నేహితుడిలా ట్రీట్ చేస్తే ఇక అతను మాత్రం కాస్త మిస్ బిహేవ్ చేశాడట. లిమిట్స్ క్రాస్ చేసేందుకు ప్రయత్నించగా జెనీలియా వార్నింగ్ ఇచ్చిందట. అయితే ఇలా జరిగిన తర్వాత జెనీలియా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది.



 చివరికి 2012లో జెనీలియా తన మొదటి సినిమా హీరో రితేష్ దేశ్ముఖ్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు మళ్లీ రియంట్రి ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే హీరోయిన్గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన జెనీలియా ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా రాణించబోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: