తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లెజెండ్రీ యాక్టర్ అయినా మమ్ముట్టి ఘన వారసత్వంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ తన తండ్రి పేరును ఉపయోగించుకోకుండా నే స్వశక్తితో హీరోగా ఎదిగారు.


ఇప్పటికే హీరోగా బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనుషులలో చెరగని ముద్రని వేసుకున్నాడు. ఈ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు. అలాగే సినిమా సినిమాకి హీరోగా తనకున్న ఫాన్స్ ఫాలోయింగ్  కూడా మరింత పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు.


ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే హీరోగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇకపోతే ఇటీవల సీతారామం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హీట్ గా నిలవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా కూడా నిలిచింది. ఇక దుల్కర్ సల్మాన్ నటించిన వాటిలో చార్లీ కూడా ఒకటి. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటనకు ప్రశంసలు దక్కడంతో పాటు 2016లో కేరళ ప్రభుత్వం ఉత్తమ నటుడుగా కూడా ఎంపిక చేసింది. అయితే ఆ సమయం లో సోషల్ మీడియాలో దుల్కర్ సల్మాన్ పై జరిగిన ఒక ట్రోలింగ్ దుల్కర్ సల్మాన్ ని ఎంతగానో బాధ పెట్టిందట.


ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ స్వయంగా చెప్పుకొచ్చాడట.. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను కేరళ ప్రభుత్వం ఉత్తమ నటుడిగా ప్రకటించిన తర్వాత ఒక నెటిజన్ ...నీ అవార్డుని అమ్మాలనుకుంటున్నావా అయితే నాకు ఇచ్చేయ్.నువ్వు కొన్న దాని కంటే 50 వేలు ఎక్కువ ఇస్తా అంటూ దుల్కర్ సల్మాన్ ఫోటో పెట్టి కామెంట్ కూడా చేశాడట. ఆ పోస్ట్ చూసి తాను ఎంతో నిరాశకు బాధకు, గురైనట్లు చెప్పుకొచ్చాడు దుల్కర్ సల్మాన్. అయితే ఆ సమయంలో నెటిజెన్ చేసిన ట్రోలింగ్స్ చూసి తనకు చాలా బాధగా అనిపించింది అని చెప్పుకొచ్చాడు దుల్కర్ సల్మాన్. తాను ఆ అవార్డు కొనుక్కోవాలి అనుకుంటే కెరీర్ మొదట్లోనే అలా చేసే వాడినని అంతవరకు ఆగే వాడిన అనిపించింది అని దుల్కర్ సల్మాన్ అని చెప్పుకొచ్చాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: