టాలీవుడ్ లో ఉన్న హీరోలు అందరిలో తాను ప్రత్యేక హీరోగా అల్లరి నరేష్ నిరూపించుకున్నాడు. టాలీవుడ్ లో హీరోలందరూ యాక్షన్ డ్రామా సినిమాలు చేస్తుంటే అల్లరి నరేష్ మాత్రం కడుపుబ్బ నవ్వించే సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
అల్లరి నరేష్ తన కెరీర్లో 50 సినిమాలుకు పైగా తెలుగులో నటించాడు. అల్లరి నరేష్ తండ్రి ప్రముఖ దర్శకుడు దివంగత ఈటీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తీసే ప్రతీ సినిమాలో కూడా కామెడీ కాకుండా ఆ హీరోలకు మంచి గుర్తింపును కూడా తీసుకువచ్చింది.

అయితే తెరమీద మనల్ని ఎంతగానో అలరించే నటుల జీవితంలో ఎన్నో విషాదగాధలు ఉంటాయి. అప్పట్నుంచి ఇప్పటివరకు ఎందరో స్టార్ హీరోల నుంచి కమెడియన్ల వరకు వారి తమ తమ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వారి ప్రేమ పెళ్లి వ్యవహారాలు వాళ్లకు చేదు జ్ఞాపకాలను మిగిల్చి పెడుతున్నాయి.. అనే మాట వాస్తవం. ప్రస్తుతం టాలీవుడ్ లో సీరియస్ సినిమాలతో దూసుకుపోతున్న అల్లరి నరేష్ తన జీవితంలో కూడా అలాంటి ఒక చేదు సంఘటన చోటుచేసుకుంది. అయితే తెరమీద తన నటనతో ఎందరినో నవ్వించే అల్లరి నరేష్ కు తన జీవితంలో కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది.

అదేంటంటే ఒక న్యూస్ రీడర్ తో తన ప్రేమ వ్యవహారం అట. అప్పట్లో ఒక ప్రముఖ ఛానల్ న్యూస్ రీడర్ తో అల్లరి నరేష్ ప్రేమాయణం నడిపిస్తున్నాడని వారిద్దరూ త్వరలోనే వివాహం చేసుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు అయితే ప్రచారం జరిగాయి. ఈ వార్తలు పై ఎంతవరకు నిజమన్నది అయితే ఎవరికి క్లారిటీ లేదు. ఇకపోతే అల్లరి నరేష్ అతనికి కాబోయే భార్య సాక్షి న్యూస్ రీడర్ లాగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇలా అనుకోవడంలో తప్పు లేదని అంటూ అల్లరి నరేష్ చెప్పడంతో అందరిననీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే అల్లరి నరేష్ కెరీర్ ఇప్పుడిప్పుడే కాస్త ఊపందుకుంటుంది. నాంది సినిమాతో మంచి సూపర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్ త్వరలోనే ఒక స్టార్ హీరో సినిమాలో కనపడే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: