కాగా ఇపుడు చంద్రముఖి వంటి బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ లో రాఘవ లారెన్స్ నటిస్తుండటం తో అంచనాలు మరింత పెరిగాయి. కామెడీ కి కామెడీ, యాక్షన్ కి యాక్షన్, ఫుల్ జోష్ తో డాన్స్ ఇలా అన్ని కలగలిపి మరోసారి ఈ చిత్రాన్ని సిద్దం చేస్తున్నారు రాఘవ లారెన్స్. పి. వాసు దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లక్ష్మి మీనన్ ఇందులో లీడ్ హీరోయిన్ గా చేస్తుండగా, ఇంకా మరో నలుగురు కొత్త హీరోయిన్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది .
అంతే కాకుండా ఈ మూవీ ప్రఖ్యాత ఓటిటి నెట్ ఫ్లిక్స్ తో డిజిటల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్టు కు సీక్వెల్ కావడంతో, ఈ మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకునేందుకు నెట్ ఫ్లిక్స్ ముందడుగు వేసి, భారీ మొత్తం లో డబ్బులు వెచ్చించి సొంతం చేసుకుంది అని అంటున్నారు . అయితే ఈ విషయం పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఇప్పుడు మరొక గాసిప్ ఈ సినిమా గురించి ఇంటరెస్ట్ యూ పెంచుతోంది. ఇందులో ఒక కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను అడిగారట. ఈ పాత్ర కూడా సినిమాకు మంచి వెయిట్ ఇస్తుందని ఫీలింగ్. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం మాత్రం ఇంకా బయటకు రాలేదు. మరి ఈ సినిమా మొదటి పార్ట్ లాగా ఆకట్టుకుని హిట్ ను సొంతం చేసుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.