చిత్రపరిశ్రమలో హీరోయిన్ సాయి పల్లవి  ఒక ప్రత్యేకం. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. కంటెంట్.. పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటుంది.

నటనకు ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకులకు చేరువయ్యింది. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్స్ అయ్యాయి. అంతేకాకుండా.. పొట్టి పొట్టి డ్రెసెస్ కాకుండా సంప్రదాయబద్దమైన చీరకట్టులో ప్రమోషన్లకు విచ్చేస్తూ దివంగత హీరోయిన్ సౌందర్యను గుర్తుచేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే సాయి పల్లవి అభిమానుల సంఖ్య ఎక్కువే. లేడీ పవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. శ్యామ్ సింగర్, లవ్ స్టోరీ, విరాట పర్వం చిత్రాలతో అలరించిన సాయి పల్లవి.. చివరిసారిగా గార్గి చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో తండ్రి కోసం పోరాడే కూతురి పాత్రలో జీవించింది. ఆమె నటనకు ప్రేక్షకులే కాదు.. సినీ విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. గార్గి తర్వాత ఈ న్యాచురల్ బ్యూటీ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా అనౌన్స్ కాలేదు. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేసిన సాయి పల్లవి .. ఇప్పుడు సరికొత్త వీడియోను నెట్టింట షేర్ చేసింది.

ఆ వీడియోలో పచ్చని ప్రకృతిని కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తోంది సాయి పల్లవి. చుట్టూ కొండలు.. అడవి.. జలపాతాల మధ్య తన తల్లిందండ్రులు, చెల్లెలితో కలిసి సరదాగా గడిపేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ కలిపి వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. సాయి పల్లవి స్టైలే వేరని.. వెకేషన్‏లో ఎక్స్‎పోజ్ ఫోటోస్ కాకుండా.. కుటుంబంతో కలిసి ఒక సామాన్య అమ్మాయిగా ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తుందంటున్నారు నెటిజన్స్.. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం సాయి పల్లవి.. తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామ్ కాంబోలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్, కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ అయిన రాజ్ ఫిల్మ్స్ ఫైనాన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: