ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో పలు విషధాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన కొంతకాలంగా కొంతమంది సాంకేతిక నిపుణులు ,నిర్మాతలు తమ కుటుంబ సభ్యులు ఇలా ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. ఇక గత మూడు నెలల నుంచి ఎక్కువగా సినీ సెలబ్రెటీలు సైతం మరణిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 11న టాలీవుడ్ దిగ్గజ నటుడు.. ప్రభాస్ పెదనాన్నగారు కృష్ణంరాజు మరణించడంతో ఇండస్ట్రీ కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అలాగే రష్మీ జయ గోపాల్ కమెడియన్ రాజు శ్రీ వాస్తవ్, శరవణ ధన్ పాల్. వంటి వారు మరణించడం జరిగింది. ఇక వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


 ఇప్పుడు తాజాగా మరొక డైరెక్టర్ మృతి మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే మలయాళ డైరెక్టర్  రామన్ అశోక్ కుమార్  గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడంతో మరణించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ వయసు 60 సంవత్సరాలు. ఇక కొన్ని రోజుల క్రితం నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఈయన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈయన మరణ వార్త విన్న మలయాళం ఇండస్ట్రీ మొత్తం ఒకసారిగా షాక్ కు గురైంది.ఇక ఈయన ఎక్కువగా కామెడీ సినిమాలను తెరకెక్కిస్తూ ఉండేవారు. అందులో కొన్ని సక్సెస్ కూడా బాగా అందుకున్నాయి అందుచేతనే ఈ డైరెక్టర్ కు మంచి పేరు లభించింది. ఈ డైరెక్టర్ మొదట తెరకెక్కించిన చిత్రం వర్ణం. అశోకన్ మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు  సైతం నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలలో పలు మరణ వార్తలు అభిమానులను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలతో సినీ ఇండస్ట్రీలో సైతం చాలా కుదేలవుతోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: