టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లలో ఒకరు అయిన శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ముద్దుగుమ్మ రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందD మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లో శ్రీ లీల తన నటనతో ,  అందచందాలతో ,   డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించి కట్టిపడేసింది. 

దానితో పెళ్లి సందD మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ కు మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ధమాకా మూవీ లో అవకాశం దక్కింది. ఇప్పటికే ధమాకా మూవీ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.  

మూవీ కి సంబంధించిన విడుదల తేదీని మరి కొన్ని రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే వరస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్న శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అలాగే అప్పుడప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీ లీల తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ లీల తన ఇన్ స్టా లో కొన్ని పోస్ట్ చేసిన ఫోటోలలో మెరున్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని అదిరిపోయే డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ లీల కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: