మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ మూడవ వారంలో నేహా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈమెకు ఎంతో మంది సెలబ్రిటీల సపోర్టు ఉన్నప్పటికీ నేహాను ఎలిమినేట్ చేశారు..అయితే నిజానికి ఇనయా , వాసంతి లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. ఆర్జీవి చేసిన పోస్ట్ మహత్యమో ఏమో తెలియదు కానీ ఇనయ సేఫ్ అయింది.. చివరి రౌండులో వాసంతి , నేహాలకు మధ్య పోటీ జరగగా..అనూహ్యంగా నేహా ఎలిమినేట్ అవ్వడం షాకింగ్ గా ఉందని చెప్పవచ్చు..

గేమ్ పట్ల ఏమాత్రం సీరియస్ నెస్ లేని కంటెస్టెంట్ లు కూడా హౌస్ లో ఉన్నప్పటికీ నేహా ఎలిమినేట్ కావడం వల్ల కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. తాను కూడా ఎలిమినేట్ అవుతానని ఊహించలేదట.అంతేకాదు నమ్మిన వాళ్లే ఇలా చేశారని, ముఖ్యంగా రేవంత్ వల్లే తాను బయటకి వచ్చానని తెలిపింది..  ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అసహనాన్ని బయట పెట్టింది నేహా చౌదరి.. అసలు ఎందుకు బయటకు వచ్చానో తెలియడం లేదని, తనకంటే అసలు గేమ్ ఆడని వాళ్ళు కూడా హౌస్ లో ఉన్నారని , 

అంతే కాకుండా వైల్డ్ కార్డు రూపంలో మరోసారి బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తానని , అసలు రివేంజ్ తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ తెలిపింది. డైరెక్టుగానే రేవంత్ వల్లే తాను బయటకు వచ్చానని తప్పకుండా అతనిపై రివేంజ్ తీర్చుకుంటానని కూడా తెలిపింది. ఎవరో ఎలిమినేట్ అవుతారు అనుకుంటే.. నన్ను ఎలిమినేట్ చేయడం అసలు ఊహించలేదు .అయితే  ఇప్పటికీ నాకు షాకింగ్ అని అనిపిస్తోంది అంటూ తన మనసులో మాటను బయట పెట్టింది నేహా చౌదరి.ఉన్నట్టుండి నేహా చౌదరి బయటకు రావడంతో ప్రేక్షకులకే కాదు సెలబ్రిటీలకు కూడా షాకింగా ఉందని చెప్పవచ్చు.మరి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఈమెకు అవకాశం ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: