యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరు కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మూవీ లలో ఆది మూవీ ఒకటి. ఆది మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించగా ,శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని నల్లమలపు శ్రీనివాస్ నిర్మించారు. ఈ మూవీ లో కీర్తి చావ్లా జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించగా , మణిశర్మమూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీలో రాజన్ పి. దేవ్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఆది మూవీ 28 మార్చ్ 2002 వ తేదీన విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

అలాగే ఆది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత మైన కలెక్షన్ లను కూడా కొల్ల గొట్టింది. ఇలా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను కొల్ల గొట్టిన ఆది మూవీ ని తిరిగి మళ్లీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆది మూవీ ని ఈ సంవత్సరం నవంబర్ మూడవ వారంలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ అదిరిపోయే రేంజ్ లో కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత మంది తెలుగు స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకున్నాయి. మరి ఆది మూవీ ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: