తెలుగు ప్రేక్షకులు ఎంతో గౌరవంగా పరిగణిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి ఆస్కార్ నామినేషన్ దక్కుతుంది అని భావిస్తున్న తరుణంలో గుజరాతి మూవీ ‘చెల్లో షో’ ఆస్కార్ నామినేషన్ కు ఎంపిక అయిన విషయం తెలిసిందే. దీనితో దక్షిణాది సినిమా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఉత్తరాది వారు ఆగోప్పతనాన్ని అంగీకరించరు అన్న విమర్శలు విపరీతంగా వచ్చాయి.


దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఆస్కార్ నామినేషన్ అవకాశాలు పూర్తిగా మూసుకు పోయినట్లే అని అంతా భావించారు. ఈపరిస్థితుల మధ్య ‘ఆర్ ఆర్ ఆర్’ స్పెషల్ షోను స్వయంగా రాజమౌళి అమెరికాలో హాలీవుడ్ ప్రముఖులకు సెప్టెంబర్ 30న ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఇంకా ఆస్కార్ అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ఇప్పుడు మళ్ళీ చర్చలు మొదలయ్యాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని ఓవర్సీస్ లో విడుదల చేసిన వేరియన్స్ పిక్చర్స్ అధినేతలు ఏదోవిధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి ఆస్కార్ నామినేషన్ వచ్చేవిధంగా ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో అన్ని ప్రయత్నాలు చేయడమే కాకుండా దీనికి సంబంధించి హాలీవుడ్ మీడియాను కూడ మేనేజ్ చేయాలి అన్న తీవ్ర ప్రయత్నాలలో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. దీనికి సంబంధించి రాజమౌళి సలహాలతో వ్యూహాలు రచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం రాజమౌళి అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ నుండి చైనాకు వెళ్ళి అక్కడ ఒక ప్రముఖ చైనీ ధియేటర్లలో ‘ఆర్ ఆర్ ఆర్’ సంబంధించిన ప్రీమియర్ షోను వేసి అక్కడ చైనా మీడియా దృష్టిలో కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ పడేలా చేసి అక్కడి నుండి ‘ఆర్ ఆర్ ఆర్’ ఆస్కార్ నామినేషన్ లోకి తీసుకోమని ఒత్తిడి చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఇండియా నుండి ఆస్కార్ నామినేషన్ కు వెళ్ళే సినిమా ఎంపిక కావడంతో ఇది అంతా సాధ్యం అయ్యే పనేనా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..



 




మరింత సమాచారం తెలుసుకోండి: