మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా వచే స్తున్నారు. సీరియస్ పొలిటీషి యన్ గా సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయ నున్నారు. కెరీర్ లో మొదటి సారి చిరు సరికొత్త రోల్ చేయ గా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అక్టోబర్ 5న దసరా కానుక గా గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయడం మరో విశేషం. ఇటీవల మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ''థార్ మార్ థక్కర్ మార్'' విడుదల చేశారు. సల్మాన్, చిరంజీవి కలిసి చేసిన ఈ సాంగ్ ఆకట్టు కుంది.

నేడు సెకండ్ సింగిల్ కి ముహూర్తం పెట్టారు. సాయంత్రం 5:04 నిమిషాలకు ''నజభజ'' అనే సాంగ్ విడుదల చేయను న్నారు. ఈ మేరకు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. గాడ్ ఫాదర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ అధికారిక రీమేకే గాడ్ ఫాదర్. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్ర ను చిరంజీవి చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలకమైన క్యామియో అప్పీరెన్స్ ఇవ్వనున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు.

ఇక గాడ్ ఫాదర్ మూవీ పై అనుకున్న స్థాయి లో బజ్ లేదు. ఇది మేకర్స్ ని భయపెడుతుంది. బిజినెస్ కూడా డల్ గా జరిగింది. ఆచార్య రిజల్ట్ నేపథ్యం లో గాడ్ ఫాదర్ కొనేందుకు డిస్ట్రి బ్యూటర్స్ ఆసక్తి చూపలేదు. తక్కువ ధరలకు అడుగుతున్న నేపథ్యం లో చాలా ఏరియాల్లో సొంత గా విడుదల చేస్తున్నట్లు సమాచారం. అలాగే హీరో సల్మాన్ సైతం మూవీ అవుట్ ఫుట్ పట్ల సంతృప్తికరంగా లేడట. హిందీలో విడుదల చేయవద్దని ఆయన చెప్పినట్లు పుకార్లు వినిపించాయి. ఫ్యాన్స్ మాత్రం మూవీ విజయం పట్ల విశ్వాసం తో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: