హీరోయిన్ రెజీనా సున్నితం గా దర్శకుడు హరీష్ శంకర్ ని టార్గెట్ చేసి విమర్శించింది, అతడి తీరును డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా బయట పెట్టింది.
హీరోయిన్స్ అంటే దర్శకుల కు చిన్న చూపు అన్నట్లు గా ఆమె సోషల్పే మీడియా లో పేర్కొంది.

అసలు విషయం ఏంటంటే..

హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కి వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సాయి ధరమ్ తేజ్ హీరో గా రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏడు సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భం గా దర్శకుడు హరీష్ శంకర్ తన ఆనందం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసు కున్నాడు.

అప్పుడే ఏడు సంవత్సరాలు అయ్యాయి అంటే నమ్మలేకుండా ఉన్నాను అంటూ సినిమా కు సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేసి హీరో సాయి ధరమ్ తేజ్ తో పాటు మరి కొందరి ని సోషల్ట్యా మీడియా లో ట్యాగ్ చేశాడు.

ఆ  హీరోయిన్ రెజీనా ని ట్యాగ్ చేయక పోవడం తో ఆమె స్పందించింది. ఆమె సోషలమీడియా లో… మా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ దర్శకుడు హరీష్ శంకర్ గారు కొన్ని క్యారెక్టర్ లను మెన్షన్ చేయడం మర్చిపోయినట్లున్నారు.. అయినా కూడా ‘సీతతో అంత ఈజీ కాదు’ అనే డైలాగ్ నాకిచ్చి చాలా ఫేమస్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసిన దర్శకుడు హరి శంకర్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ రెజినా కౌంటర్ సమాధానం చెప్పింది.

తన పేరును మెన్షన్ చేయలేదు అని డైరెక్టుగా అనకుండానే అందరికీ అర్థం అయ్యేలా హరీష్ శంకర్ కి ఆమె ఇచ్చిన కౌంటర్ అందరిని ఆశ్చర్య పరచుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న హరీష్ శంకర్ రెజినా సమాధానానికి ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: