గాడ్ ఫాదర్ ట్రైలర్: పంచ్ డైలాగులతో పిచ్చెక్కించిన చిరు?

మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ 'గాడ్ పాదర్' సినిమా ట్రైలర్ వచ్చేసింది. మెగా అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ట్రైలర్ ఉండటంతో వారి ఆనందానికి అసలు అవధులు అనేవి లేకుండా పోయాయి.మెగాస్టార్ చిరంజీవి చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్ ని హుషారెత్తిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల 12 సెకన్లు నిడివి కలిగిన ట్రైలర్ లో చిరంజీవి కొత్త లుక్ లో కనిపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో అభిమానులకు కిక్కిచ్చారు.అక్టోబర్ 5న ఆడియన్స్ ముందుకు ఈ సినిమా రానుండగా.. నేడు అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపైనే గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. 


ఈ ట్రైలర్ లో చిరంజీవి యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మలయాళ సూపర్ హిట్ చిత్రం 'లూసిఫర్' రీమేక్ గా ఈ సినిమాను రూపొందించిన విషయం విధితమే. స్థానిక నేటివిటీకి తగ్గట్లు లూసిఫర్ కథలో చాలా మార్పులు చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు కీలక పాత్ర పోషించారు.ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు మెగాస్టార్ అభిమానులు.ఎందుకంటే రీసెంట్ గా ఆచార్య సినిమాతో చిరంజీవి ఊహించని పరాజయాన్ని చూశాడు. ఆ మచ్చని పోగొట్టుకునేందుకు గాడ్ ఫాదర్ సినిమాని చాలా జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగా వుంది. ఇక సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: