డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా ఈనెల 30వ తారీఖున పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది.అయితే ఈ చిత్రాన్ని ప్రదర్శనను అడ్డుకోవడానికి థియేటర్ యాజమాన్యులను బెదిరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..ps-1 సినిమాని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో కూడా భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తూ ఉన్నారు. మనదేశంలో కంటే కొన్ని గంటల ముందే యూఎస్ఏ లో విడుదల కాబోతున్నది. అలాగే కెనడాలో కూడా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు అయితే అక్కడ కొంతమంది విధ్వంసకారులు ఈ సినిమాని విడుదల చేయకుండా అడ్డుకొని ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.


కొంతమంది నివేదికల ప్రకారం పొన్నియన్ సెల్వన్ సినిమాని ప్రదర్శిస్తే థియేటర్ల పైన దాడి చేయబోతున్నట్లుగా కొంతమంది ఆకతాయిలు థియేటర్లు యాజమాన్యాన్ని బెదిరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా హామిల్టన్, కిచేనర్ , లండన్ లోని ఇలాంటి బెదిరింపులు ఎక్కువగా వినిపిస్తున్నట్లు సమాచారం. దీంతో అక్కడి థియేటర్ నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్న అధికారులు ఎలాంటి అవాంచిత ఘటనలు జరగకుండా చూసుకుంటామని థియేటర్ యాజమాన్యులకు హామీ ఇచ్చినట్టుగా సమాచారం.


ప్రజాస్వామ్య దేశంలో సినిమాలు విడుదలవుతున్నప్పుడు ఇలాంటి బెదిరింపులు రావడం వల్ల అక్కడికి వెళ్లి ప్రేక్షకులు థియేటర్లు చూస్తారా అనే విషయం పై చిత్ర బృందం కాస్త నిరుత్సాహంతో ఉన్నట్టుగా సమాచారం. ముఖ్యంగా తమిళ సినిమాలకు గతంలో కూడా కెనడాలో పలు బెదిరింపులు వచ్చాయట. ఇప్పుడు ఈ సినిమాకు కూడా బెదిరింపులు తప్ప లేదని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి. తమిళ ప్రేక్షకులు మాత ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డు బ్రేక్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: