పెళ్ళి చేసుకుని ఒక బిడ్డ పుట్టిన తరువాత కాజల్ కేవలం కొద్ది గ్యాప్ మాత్రమే తీసుకుని తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకుంది. ప్రస్తుతం కమలహాసన్ తో ‘భారతీయుడు 2’ మూవీలో నటిస్తున్న కాజల్ త్వరలో మరికొన్ని సినిమాలు చేయడానికి ఉత్సాహ పడుతోంది.  


ఇలాంటి పరిస్థితుల మధ్య ఈమె తన ఆరోగ్య రహస్యాన్ని తన అభిమానులకు షేర్ చేసింది. తనకు ఆమధ్య డైజెస్టివ్ సమస్యలు ఏర్పడినప్పుడు ఒక డాక్టర్ సలహామేరకు ‘బ్లాక్ వాటర్’ తాగుతున్నట్లు ఆమె సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాన్ని షేర్ చేయగానే ఆవిషయం వెంటనే వైరల్ అయిపోయింది. దీనితో చాలామంది ఈ బ్లాక్ వాటర్ వైద్యం గురించి సెర్చి చేయడం ప్రారంభించారు.


అయితే మార్కెట్ లో మనకు లభించే మినరల్ వాటర్ బోటిల్ ధరకన్నా ఇది సుమారు 10 రెట్లు అధికం. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ హీరోయిన్ శృతిహాసన్ లు కూడ ఇలాంటి డైజెస్టివ్ సమస్యలు ఏర్పడినప్పుడు ఈ బ్లాక్ వాటర్ వైద్యంతో తమ అనారోగ్య సమస్యల నుండి బయటపడినట్లు తెలుస్తోంది. అయితే భారతదేశంలో సుమారు 70 శాతం మందికి త్రాగడానికి మంచినీరు కూడ దొరకని పరిస్థితులలో ఇంత ఖరీదైన బ్లాక్ వాటర్ గురించి కాజల్ తన అభిమానులకు తెలియచేసినా ఎంతమంది కాజల్ సలహాలను పాటించగలరు అన్నది సందేహమే.


ప్రస్తుతం సీనియర్ హీరోల సినిమాలకు హీరోయిన్స్ సమస్య వేదిస్తోంది. దీనితో ఆలోటును తీర్చడానికి కాజల్ మళ్ళీ స్లిమ్ గా తయారై రెడీ అవుతున్నప్పటికీ సీనియర్ హీరోల దృష్టి మాత్రం ఆమె పై కాకుండా నయనతార పై ఉంది. ఏది ఏమైనా చాలామంది నెటిజెన్ లకు కాజల్ బ్లాక్ వాటర్ గురించి అవగాహన కలిపించి తనవంతు ఆరోగ్య సలహాలను ఇస్తోంది. ‘భారతీయుడు 2’ ఊహించిన విధంగా సక్సస్ అయితే కాజల్ మళ్ళీ ట్రాక్ లోకి రావడమే కాకుండా ఆమె భారీ పారితోషికాలను డిమాండ్ చేసే అవకాశం ఉంది..మరింత సమాచారం తెలుసుకోండి: