టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య కమెడియన్ గా మంచి టాప్ రేసులో ఉన్న సమయంలోనే గీతా ఆర్ట్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇక అల్లు రామలింగయ్య కమెడియన్ గా బిజీగా ఉన్న సమయంలో అల్లు అరవింద్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి ఆ బ్యానర్ ద్వారా అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు.ఈ మధ్యకాలంలో ఎందుకో ఏమో తెలియదు కానీ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఏర్పాటు చేసి ఆ బ్యానర్ మీద సినిమాలు నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇక  దాని నిర్మాణ బాధ్యతలు అన్నీ బన్నీ వాసు చూసుకుంటున్నారు.  కొన్నాళ్ల క్రితం అల్లు స్టూడియోస్ పేరిట స్టూడియోస్ నిర్మించడానికి అల్లు కుటుంబం నిర్ణయం తీసుకుంది. 

అయితే ఈ మేరకు హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ గండిపేట దగ్గరలో ఒక స్టూడియో నిర్మాణం ప్రారంభించారు.ఇక రెండేళ్ల క్రితం అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసి గండిపేట దగ్గర శంకుస్థాపన కూడా చేశారు. ఇదిలావుంటే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ స్టూడియో నిర్మాణం పూర్తయింది.  స్టూడియో ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారు అయింది అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా అక్టోబర్ ఒకటవ తేదీన ఈ స్టూడియోస్ ని ఘనంగా అల్లు కుటుంబ సభ్యుల ప్రారంభించబోతున్నారు.ఇక ఈ నేపథ్యంలో స్టూడియో లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ ఈవెంట్ లాగా ప్లాన్ చేస్తున్నారు.  మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

 అయితే ఈ మధ్యకాలంలో అల్లూ కుటుంబానికి మెగా కుటుంబానికి దూరం పెరిగింది అని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక ఆ మధ్యకాలంలో రామ్ చరణ్ మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే అల్లు అర్జున్ మీద రాంచరణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.ఇకపోతే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మధ్య ఎందుకు ఈ రగడ అని అప్పుడు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా భావించారు. ఇక ఇలాంటి క్రమంలో తమ మధ్య ఎలాంటి భేదభావాలు లేవనే సంకేతం ఇచ్చేందుకే ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ స్టూడియో ఓపెనింగ్ జరిగిన తర్వాత స్టూడియోలో షూట్ జరిగే మొట్టమొదటి సినిమా పుష్పాది రూల్ అని అంటున్నారు.ఇదిలావుండగా ప్రస్తుతం సినిమా మేకింగ్ అంతా అత్యధిక అత్యధిక టెక్నాలజీలతో సాగుతోంది.అయితే  అందుకే అత్యధిక సినిమాలు షూట్ చేసుకునే విధంగా పది ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఈ స్టూడియోని నిర్మించారు. కాగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఈ స్టూడియో ఇతర రాష్ట్రాల సినీ మేకర్స్ కి కూడా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: