మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయిన అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరో గా ,  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తేరకెక్కిన అ ఆ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించిన అనుపమ పరమేశ్వరన్ తన నటనతో ,  అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ని ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన రౌడీ బాయ్స్ మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ ,  కొంత కాలం క్రితం విడుదల అయిన అంటే సుందరానికి మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. అలాగే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన కార్తికేయ 2 మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ప్రస్తుతం అనుపమ పరమేశ్వర ,  నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజీస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరీర్ ని ముందుకు సాగిస్తున్న అనుపమ పరమేశ్వరన్ మరో క్రేజీ మూవీ లో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కబోయే డీ జే టిల్లు మూవీ లో అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా మూవీ యూనిట్ సెలెక్ట్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనక నిజం అయితే అనుపమ పరమేశ్వరన్ మరో క్రేజీ మూవీ ఆఫర్ కొట్టేసినట్టే అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: