యంగ్ టాలెంటెడ్ నటులలో ఒకరు అయిన దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని దుల్కర్ సల్మాన్ సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ కలిగిన హీరో లలో ఒకరు. ఈ హీరో పాన్ ఇండియా మూవీ లతో క్రేజ్ సంపాదించుకోవడం కాకుండా అన్ని భాషల మూవీ లలో కూడా నటిస్తూ అన్ని ప్రాంతాలలో మంచి హీరోగా క్రేజీ ను తెచ్చుకుంటున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో దుల్కర్ సల్మాన్ అన్ని భాషల సినిమా లలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం దుల్కర్ సల్మాన్ 'కురూప్' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మలయాళ భాషలో తెరకెక్కింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే కొంత కాలం క్రితం దుల్కర్ సల్మాన్ 'కన్నుమ్ కన్నుమ్ కొల్లయదితల్' అనే తమిళ మూవీ లో నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఈ మూవీ తెలుగు లో కనులు కనులను దోచాయంటే అనే పేరుతో విడుదల అయింది.

మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' అనే తెలుగు మూవీ లో కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే తాజాగా దుల్కర్ సల్మాన్ 'చుప్' అనే హిందీ మూవీ లో కూడా నటించాడు. ఇలా దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వివిధ భాషల సినిమాల్లో నటిస్తూ అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: