లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయిన శంకర్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం భారతీయుడు అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు కూడా దక్కాయి. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా అద్భుతమైన విజయాన్ని సాధించి అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది.

మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ విజయంలో ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ ద్వారా కమల్ హాసన్ కు శంకర్ కి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇలా చాలా సంవత్సరాల క్రితం విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న భారతీయుడు మూవీ కి ప్రస్తుతం దర్శకుడు శంకర్ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ లో కమల్ హాసన్ హీరోగా నటిస్తూ ఉండగా కాజల్ అగర్వాల్ ,సి రకుల్ ప్రీత్ సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

మూవీ కి అనురుద్ర రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కొంత కాలం క్రితం ఈ మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని అని వార్య కారణాల వల్ల ఆగి పోయింది. మళ్ళీ తిరిగి ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై దేశవ్యాప్తంగా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: