ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ దర్శకులలో అటు సుకుమార్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్న సుకుమార్ సినిమా టేకింగ్ మాత్రం సరికొత్త స్టైల్ లో ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక మొన్నటికి మొన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే డైరెక్టర్ కాకముందు సుకుమార్ లెక్చరర్ గా కెరియర్ మొదలు పెట్టాడు.


 అంతేకాదు ఇక చిన్నప్పుడు బాగా చదువుకొని ఒక పెద్ద సైంటిస్ట్ కావాలి అని అనుకునేవాడటఈ లెక్కల మాస్టారు. కానీ చివరికి డాక్టర్ కావాల్సినవాడు యాక్టర్ అయ్యాడు అన్న నానుడికి సరిపోయేలా సైంటిస్ట్ కావాల్సినవాడు డైరెక్టర్ గా మారిపోయాడు. ఇండస్ట్రీలోకి రావడమే సూపర్ హిట్లు అందుకొని బాగా పేరు ప్రఖ్యాతలు రాలేదు. అందరిలాగానే ఎన్నో కష్టాలు పడ్డాడు సుకుమార్.  అయితే ఆర్య సినిమా సూపర్ హిట్ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో  డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయాడు సుకుమార్. ఇకపోతే సుకుమార్ సినిమాలలో అటు ఐటెం సాంగ్స్ కి కాస్త ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టి మరి ఐటెం సాంగ్స్ తెరకెక్కిస్తూ ఉంటాడు సుకుమార్. ఇక సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా ఐటమ్ సాంగ్ ఉంటుంది. అయితే ఇలా ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టుకోవడానికి కారణం తన మొదటి సూపర్ హిట్ సినిమా ఆర్య అని ఇటీవల సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఇందులో ఆ అంటే అమలాపురం సాంగ్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఐటెం సాంగ్ సినిమాకు ప్లస్ అవడం.. బిజినెస్ పరంగా కలిసి వస్తూ ఉండడంతో సుకుమార్ ఇక ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ వస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: