ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు అయినటువంటి రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ ఇప్పటికే తెలుగు లో ఎన్నో మూవీ సాంగ్ లకు కొరియోగ్రఫీ చేయడం మాత్రమే కాకుండా ,  ఎన్నో మూవీ లకు దర్శకత్వం కూడా వహించాడు. రాఘవ లారెన్స్ తెలుగు లో దర్శకత్వం వహించిన మాస్ ,  డాన్ మూవీ లు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించాయి.

అలాగే రాఘవ లారెన్స్ ,  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రెబల్ మూవీ కి దర్శకత్వం వహించాడు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నో మూవీ లు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా సాధించాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాఘవ లారెన్స్ 'రుద్రుడు' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కది లరేశన్ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23 న తేదీన విడుదల చేయనున్నట్లు చిత్త బృందం ఇది వరకు ప్రకటించింది.

కాకపోతే ఈ మూవీ వి ఎఫ్ ఎక్స్ పనులకు మరింత సమయం కేటాయించాల్సి రావడం తో రుద్రుడు ఈ మూవీ ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మూవీ యూనిట్ ప్రకటించింది. అలాగే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీన రుద్రుడు మూవీ ని తమిళ్ ,  తెలుగు , కన్నడ ,  మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ పేర్కొంది. ఇలా తాజాగా రుద్రుడు మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే రాఘవ లారెన్స్ ప్రస్తుతం ఈ మూవీ తో పాటు చంద్రముఖి 2 మూవీ లో కూడా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: