తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లు అయినటు వంటి రెజీనా కేసాండ్రా ,  నివేద థామస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు ముద్దు గుమ్మ లు ఇప్పటికే ఎన్నో మూవీ లలో ఎన్నో పాత్ర లలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇలా ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తమ నటన తో ,  అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేసిన ఈ ఇద్దరు ముద్దు గుమ్మ లు తాజాగా షాకిని డాకిని అనే మూవీ లో కలిసిన నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటీమణులు అయినటువంటి రెజీనా కేసాండ్రా , నివేదా థామస్ కలిసి నటించిన మూవీ కావడంతో ఈ మూవీపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ మూవీ 16 సెప్టెంబర్ 2022 వ తేదీ న థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించ లేక పోయింది.

ఇది ఇలా ఉంటే బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించ లేక పోయిన షాకిని డాకిని మూవీ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ మూవీ రేపు అనగా సెప్టెంబర్ 30 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి'  ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయిన షాకిని డాకిని మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: