ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇటీవల ఒక సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలోని మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది.ముందస్తు ప్లాన్ ప్రకారం దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో చాలా కఠినమైన సన్నివేశాలను ముందుగానే పూర్తి చేసుకుంటున్నాడు. అందుకే మొదటి షెడ్యూల్లో ఒక పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశారు.అయితే ఇక సెకండ్ షెడ్యూల్ దసరా తర్వాత మొదలుపెట్టాలని మరో ప్లాన్ అయితే రెడీ అయింది. అయితే ఇంతలోనే మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మహేష్ బాబు తల్లి గారు ఇందిరా దేవి మృతి గారు చెందడంతో ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు అయితే తల్లి మరణం వార్తను తట్టుకోలేకపోతున్నాడు. ఈ సమయంలో మహేష్ బాబు విషాదం నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది.ఈ పరిస్థితిని అర్ధం చేసుకోని మహేష్ బాబుని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ మాత్రం డిస్టర్బ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. కావాల్సినంత టైమ్ తీసుకున్నా పరవాలేదు అని ముందుగానే తన టీమ్ కు ఇంటిమెట్ చేసినట్లు టాక్.


అసలైతే సెకండ్ షెడ్యూల్ కోసం మరో రెండు మూడు రోజుల్లో చర్చలు జరపాలని కూడా అనుకున్నారు.కానీ మహేష్ బాబు ప్రస్తుత పరిస్థితులలో సినిమాల గురించి ఆలోచించే పరిస్థితిలో అయితే లేడు.అంతేకాకుండా కుటుంబ సంప్రదాయం ప్రకారం తొమ్మిది రోజుల తర్వాత కూడా కర్మ కు సంబంధించిన కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక అంతేకాకుండా 15 రోజుల తర్వాత కూడా కుటుంబంలో కొన్ని ఆచారాలు ప్రకారం తల్లికి కడసారి వేడుకలు పలికే వారు కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.అందుకే దసరా తర్వాత కూడా మహేష్ బాబు మరో 15 రోజులపాటు అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం. ఇక ఈ లోపు SSMB28 కోసం ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ లో ప్లాన్ ను మార్చనున్నారు.ప్రస్తుతం మహేష్ తో అవసరం లేని కొన్ని సీన్స్ తీసే పనిలో త్రివిక్రమ్ వున్నారు. ఇక ఆ తరువాత మహేష్ పరిస్థితులు కొంచెం తగ్గాకా ఆయనతో మిగతా సీన్లు షూట్ చేసే ప్లాన్ లో త్రివిక్రమ్ వున్నాడు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ అనేది అక్టోబర్ 10 న జరిగే అవకాశాలు వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: