విశ్వ నటుడు కమలహాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో భారతీయుడు -2 సినిమా షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తిరుపతి పరిసరాలలో షూటింగ్ జరుపుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి షెడ్యూల్ తో కూడా కమలహాసన్ ,కాజల్ అగర్వాల్ నటీనటులు సైతం పాల్గొన్నట్లు సమాచారం. ఈ చిత్రీకరణలో భాగంగా సేనాపతి పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అక్కడ షూటింగ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ఈ సన్నివేశాలు కీలకమైన ఆకర్షణీయంగా నిలుస్తాయని చిత్ర బృందం ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది.


సేనాపతి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనీ.. ఈ పాత్ర కోసం కమలహాసన్ చాలానే కష్టపడ్డాడని ఈ పాత్ర అత్యంత రక్తి కట్టించేలా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇక ఈ చిత్రం భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇందులో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నారు. అంతేకాకుండా అవినీతి వ్యవస్థను లంచగొండి పై సేనాపతి ఎలా ఆకట్టుకుంటాడో అని అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక స్వాతంత్ర సమరయోధుడు అయిన సేనాపతి అవినీతి వ్యవస్థ పై ఎలా తిరగబడతాడు అనే సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు సమాచారం. అలాంటి సన్నివేశాలతో ఇండియన్ -2 సినిమాకి లింక్ అప్ చేస్తు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.


ఇక అలనాటి సేనాపతిని గుర్తు చేయాలి అంటే కచ్చితంగా లుక్ లో చాలా మార్పులు రావాలి ఈ షెడ్యూల్ తిరుపతిలో కొన్ని రోజులపాటు షూటింగ్ జరిగినట్లుగా సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం చిత్ర బృందం చాలా శ్రమ పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ను కూడా శరవేగంగా పూర్తి చేయాలని పనులలో చిత్ర బృందం నీమజ్ఞులైనట్లుగా తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కూడా మరొక కథానాయకుడు నటిస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: