సాధారణంగా పండుగలకు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక ఆ  ఆ సినిమాలకు పోటీగా సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు సాహసించరు. అయితే  ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు మాత్రం పండుగలను టార్గెట్ చేస్తూ తమ బ్యానర్ లో తెరక్కే సినిమాలను రిలీజ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.అయితే ఈ ఏడాది సంక్రాంతికి డీజే టిల్లు సినిమాను రిలీజ్ చేయాలని సితార నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యంగా థియేటర్లలో విడుదల కాగా ఆ సినిమా సక్సెస్ సాధించింది.అయితే ఇక  దసరాకు మాత్రం సితార నిర్మాతలు స్వాతిముత్యం సినిమాను కచ్చితంగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. 

కాగా బెల్లంకొండ గణేష్ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానుండగా వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.అయితే  ఇప్పటికే విడుదలైన స్వాతిముత్యం ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక స్వాతిముత్యం డైరెక్టర్ లక్ష్మణ్ కృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పెద్ద ఫ్యాన్ అని అన్నారు.ఇకపోతే త్రివిక్రమ్ సినిమాలు నాపై ముద్ర వేశాయని ఆయన వల్లే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చానని ఆయన కామెంట్లు చేశారు. అయితే స్వాతిముత్యం కథ చదివి త్రివిక్రమ్ గారు కథ చక్కగా రాశానని కథ కొత్తగా ఉందని ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదని అన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

 ఇక ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లొచ్చని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పడం నాకు సంతోషాన్ని కలిగించిందని లక్ష్మణ్ కృష్ణ అన్నారు.అయితే అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కానున్న స్వాతిముత్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.ఇక  10 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. ఇకపోతే స్వాతిముత్యం సినిమాతో బెల్లంకొండ గణేష్ ఏ రేంజ్ హిట్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే పండుగలకు సినిమాలను రిలీజ్ చేస్తే భారీగా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉండటంతో సితార నిర్మాతలు ఈ విధంగా చేస్తున్నారని బోగట్టా..!!

మరింత సమాచారం తెలుసుకోండి: