బుల్లితెరపై రియాల్టీ షోలలో ప్రసారమయ్యే అటువంటి వాటిలో బిగ్ బాస్ షో కూడా ఒకటి. అయితే ఈ షో చాలామందికి మైనస్ అవుతుందని భావిస్తున్నారు. మరి కొంతమంది ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లలో చాలామంది ఈ షో తమకు మైనస్ అయిందనే అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక బిగ్ బాస్ నుండి మూడో వారం ఎలిమినేట్ అయిన నేహా చౌదరి ఈ షో గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం.


నేహా చౌదరి మాట్లాడుతూ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాను అంటే అది చాలామంది నమ్మలేక ఉన్నారని తెలియజేస్తుంది. నా ఎలిమినేషన్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని తెలియజేసింది. కంటెంట్ ఇవ్వని వాళ్లు బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతూ ఉన్నారని తెలియజేస్తోంది. ఆ కంటెంట్ పేరు చెప్పడం తనకు ఇష్టం లేదని కూడా తెలుపుతోంది. వాసంతి గ్లామర్ డాల్ గానే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూ వస్తోందని నేహా చౌదరి తెలియజేస్తుంది. నేను నిజంగా తప్పు చేసి ఉంటే ఎపిసోడ్ లో తనని ఎందుకు హైలెట్ చేయలేదని నేహా చౌదరి తెలియజేస్తోంది.


ఇక ఇనయ గురించి బిగ్ బాస్ హౌస్ లో చాలామంది రాంగ్ గా మాట్లాడుతూ ఉంటారని వీకెండ్ లో నాగార్జున వచ్చినా కూడా తన వెర్షన్ ని రివర్స్ చేశారని తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక నాగార్జున గారు ఫెయిర్ గా ఉండడం లేదని టాక్ కూడా ఎక్కువగా వినిపిస్తోందని దీనిపైన కూడా నేను కామెంట్ చేయనని నేహా చౌదరి తెలియజేయడం గమనార్హం. నాగార్జున గారు ఒకరిద్దరి కంటెస్టెంట్లను కావాలని హైలైట్ గా ఎప్పుడు చేస్తూ ఉంటారని చెప్పుకొస్తోంది. నాగార్జునకు ఆర్జీవి తో  స్నేహం ఉన్నది.. అందువల్లనే ఇనయాను హౌస్ లో కొనసాగిస్తున్నారని నేహా సోదరి తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: