తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్  మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం కూడా టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అజిత్ తాను నటించిన సినిమా లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ని సృష్టించుకున్నాడు.

అజిత్ ఆఖరు గా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన వలిమై అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా తమిళ్ ఠీ పాటు తెలుగు ,  కన్నడ ,  మలయాళ ,  హిందీ భాషల్లో భారీ ఎత్తున వలిమై మూవీ విడుదల అయ్యింది. ఈ మూవీ లో టాలీవుడ్ యువ  హీరో లలో ఒకరు అయినా కార్తికేయ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే మరో సారి హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ మరో మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్రం బృందం విడుదల చేసింది.

ఈ మూవీకి తునివు అనే టైటిల్ ని మూవీ యూనిట్ ఖరారు చేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తం కోడ్ చేసి దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమా విడుదల తేదీ కూడా ఖరారు కాక ముందే ఈ సినిమాకు అదిరి పోయే రేంజ్ బిజినెస్ జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ పై తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: