తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడి గా ,  నిర్మాత గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించడం తో పాటు ఎన్నో మూవీ లను నిర్మించాడు. ఇది ఇలా ఉంటే నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరిన్ మరియు సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్టు 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుత మైన టాక్ బాక్సా ఫీస్ దగ్గర లభించడంతో ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు కూడా దక్కాయి.

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. బింబిసార మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేయగా ,  39 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 23 కోట్ల లాభాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది.  ఇలా బింబిసారా మూవీ అదిరి పోయే రేంజ్ లాభాలను అందుకొని ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: