టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పాన్ ఇండియా స్టార్ హీరో  ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఇక  ప్రభాస్ సినిమాలన్నీ 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.అయితే వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ రెండు సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధిస్తాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇకపోతే ఆదిపురుష్ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుండగా సలార్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించగా సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.

ఇక  ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది.అయితే  ప్రభాస్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఇక  ప్రభాస్ అభిమానులు మాత్రం గిన్నీస్ రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుతోంది. కాగా కొత్త సినిమాలు విడుదలైతే ఫ్యాన్స్ కటౌట్లు పెడతారనే సంగతి తెలిసిందే.అయితే అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు కాగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా భారీ కటౌట్లను ఏర్పాటు చేయాలని అభిమానులు భావిస్తున్నారని సమాచారం.

ఇక ప్రభాస్ భారీ కటౌట్ పెట్టి ఆ కటౌట్ తో గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.అయితే  220 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేసి గతంలో కటౌట్ లకు సంబంధించి ఉన్న రికార్డులను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.ఇదిలావుంటే ఇక కటౌట్ తోనే ప్రభాస్ పేరు వార్తల్లో నిలిచేలా చేయాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.ఇక  గిన్నీస్ రికార్డ్ విషయంలో ప్రభాస్ అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. ఇదిలావుంటే మరోవైపు ప్రభాస్ రెమ్యునరేషన్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అయితే ఒక్కో ప్రాజెక్ట్ కు 120 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం ద్వారా ప్రభాస్ వార్తల్లో నిలుస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: