టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చందు మండేటి దర్శకత్వం వహించగా , అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస్ రెడ్డి ,  వైవా హర్ష ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కార్తికేయ 2 మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వల్ గా తెరకెక్కింది.

ఇలా కార్తికేయ మూవీ కి సీక్వల్ గా తెరకెక్కడంతో కార్తికేయ 2 మూవీ పై మొదటి నుండి సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ కార్తికేయ 2 మూవీ ఆగస్టు 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ని తెచ్చుకోవడంతో కార్తికేయ 2 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా కార్తికేయ 2 మూవీ ని జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో సెప్టెంబర్ 5 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు  జీ 5 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే కార్తికేయ 2 మూవీ క్లోసింగ్ కలెక్షన్ ల వివరాలను ఒక సారి పరిశీలించినట్లు అయితే ...  కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 124 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 59 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.  మొత్తంగా కార్తికేయ 2 మూవీ 46 కోట్ల లాభాలను అందుకొని ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: