బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . షారుక్ ఖాన్ తాను నటించిన హిందీ మూవీ ల ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించు కున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం షారుక్ ఖాన్ 'జవాన్' అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి తమిళ ఇండస్ట్రీ లో అద్భుత మైన క్రేజ్ ఉన్నటు వంటి దర్శకులలో ఒకరు అయిన అట్లీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  నయన తార ,  ప్రియమణి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించ బోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుండి షారుక్ ఖాన్ కి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ యూనిట్ విడుదల చేయగా , ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా జవాన్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జవాన్ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి'  సంస్థ లలో ఒకటి అయినటువంటి నేట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే జవాన్ మూవీ పై హిందీ మరియు తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: