తమిళ స్టార్  డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో తమిళలో బాహుబలి రేంజ్ లో రూపొందిన మూవీ పొన్నియిన్ సెల్వన్1. ఈ మూవీ మణిరత్నంకు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీని ఎప్పటినుంచో తెరకెక్కించాలనుకున్నాడు.ఎట్టకేలకు మణిరత్మం డ్రీమ్ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మణిరత్నం సినిమాలంటే మొదటి నుంచి తెలుగులో కూడా వాటికి మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కావటం లేదు. అయితే ఆయనకి చాలా కాలంగా ఓ డ్రీమ్ ఉంది. తమిళంలో బాగా ప్రాచుర్యం పొందిన కల 'కల్కినవలను తెరకెక్కించాలని. అందుకోసం ఆయన చాలా కష్ట,నష్టాలకు ఓర్చి, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నా పెద్దగా బజ్ లేదు. తమిళంకే పరిమితమైన చరిత్రను తెలుగు వారు చూడటం కష్టమనే భావన చాలా మందిలో ఉంది. అది నిజమేనా...తెలుగువారికి ఈ కథ పడుతుందా...అసలు ఆ కథేంటి..బాహుబలి స్దాయిలో అల్లరించిందా అనే విషయాలు తెలుసుకుందాం.


పదో శతాబ్దంలో పరిపాలన సాగించిన చోళ రాజ్యపు రాజుల గొప్పతనం గురించి చెప్తూ ఈ కథ మొదలవుతుంది. అప్పటి చోళ రాజ్యంను ఎలాగైనా సామ,దాన,దండోపాయాలతో దక్కించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తూంటారు. అది రాజు ఆదిత్య కరికాలుడు(విక్రమ్‌) కు ఓ సవాల్ గా మారుతుంది. తనదైన శైలిలో తన రాజ్యాన్ని రక్షించేందుకు వ్యూహాలు రచిస్తూంటాడు..ఆ క్రమంలో రాజ్య ఆక్రమణ కోసం,వారసులను చంపటం తన వెనక పెద్ద కుట్ర జరుగుతోందని తలుస్తోంది. ఆ కుట్రను ఛేదించటానికి .... కరికాలుడు... వల్లవయాయ (కార్తి) ని పంపుతాడు. ఈ క్రమంలో ఏమి బయిటపడింది..అసలు కుట్రకు కీలకం ఎవరు...అరుమౌజి (జయం రవి) ని వల్లవరాయ ఎలా రక్షించాడు...అనేది ఈ భాగంలోని ప్రధాన కథ. ఇందులో కుందవాయి(త్రిష), నందిని(ఐశ్వర్య రాయ్‌) పాత్రలు చాలా కీలకమైనవి.ఎవరు ఈ కథలో విలన్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవటం  ఓ ఇన్విస్టిగేషన్ స్టైల్ లో కథ కొంతమేర నడవటం తో ఎక్కడా ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ కనపడదు. ఉన్నంతలో ఇంటర్వెల్ తర్వత వచ్చన ప్లాష్ బ్యాక్ తో కథ నడక మొదలయ్యి..ఇంట్రస్టింగ్ గా మారింది. అప్పుడు మనకు ఫస్ట్ హాఫ్ లో జరిగిన సీన్స్ అర్దమవటం మొదలవుతాయి. అన్నిటికన్నా ప్రధాన మైన సమస్య ...గుర్తపెట్టుకునే, గుర్తుండిపోయే పాత్రలు కనపడవు. అన్ని పాత్రలు సమాన ప్రాధాన్యం అన్న రీతిలో చిత్రీకరించారు. అది నవలలో చదవటానికి బాగుంటుంది కానీ సినిమాగా ఇబ్బంది పెడుతుందనే విషయం మర్చిపోయారు.


ఇక పోతే ఈ సినిమా తమిళం వాళ్లకు నచ్చే అంశాలతోనే తెరకెక్కింది. అందులో వింత , విచిత్రమూ కూడా లేదు. ఇది బాహుబలి కథలా స్వంతంగా రాసుకున్న ఫిక్షన్ కథ అయితే యూనవర్శిల్ అప్పీల్ తెచ్చే అవకాసం ఉండేది. కానీ ఈ సినిమాకు కుదరలేదు. అలాగే ఈ కథను పూర్తిగా పుస్తకం అనుసరించి చేయటం వల్లనేమో ...ట్విస్ట్ లు, వావ్ ఎలిమెంట్స్ ప్రత్యేకంగా స్క్రీన్ ప్లే లో కనపడలేదు. గ్రిప్పింగ్ కథనం నడవదు. వరసగా పాత్రల పరిచయం జరిగిపోతూంటుంది. కథ జరిగే ప్రాంతాలు మారిపోతూంటాయి. కానీ కథ కదిలినట్లు అనిపించదు. దానికి తోడు స్లోగా కథ నడవటం కూడా ఇబ్బంది పెడుతుంది.మొత్తానికి సినిమా అందంగా అయితే వుంది కానీ బాహుబలి లాంటి ఎలివేషన్స్ పెట్టుకొని చూస్తే నచ్చదు.ఫ్రెష్ గా ఫీలయ్యి ఓ కొత్త స్టోరీ తెలుసుకుందాం అనుకునే వాళ్లకి నచ్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

PS1