రీ ఎంట్రీ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయాలలో ఎదురైనా పరాభవాన్ని మర్చిపోయేందుకు అయన వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆలా పవర్ స్టార్ నటించిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అవి ఆయనకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి అని చెప్పాలి. అలా రీ ఎంట్రీ తర్వాత పవన్ నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడం ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు పవన్ ఫ్యాన్. దానికి తగ్గట్లుగానే అయన ఇప్పుడు చేయబోయే సినిమా కోసం ఎంతో కేర్ తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమా హరిహర వీర మల్లు. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు లో మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. మరి ఈ సినిమా పవన్ కు హ్యాట్రిక్ హిట్స్ ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమా మొగలాయిలా కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓ గజదొంగదా కనిపించబోతున్నాడు అంటున్నారు.

అయితే ఈ సినిమానుంచి రీసెంట్ గా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ సంచనల్ను సృష్టిస్తోంది. అయితే ఎలాంటి ఆటంకం లేకుండా ఈ సినిమా యొక్క షూటింగ్ జరుగుతుంది అనుకుంటే తాజాగా పవన్ ఈ సినిమా లుక్ లో కాకుండా వేరే లుక్ లో దర్శనమివ్వడం నిజంగా ఈ సినిమా మళ్ళీ ఆగిపోయిందా అన్న అనుమానాలను కలిగిస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే తొందరగా ఓ క్లారిటీ రావాల్సిందే. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కు మొదటినుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. అతి త్వరలోనే షూటింగ్ పునః ప్రారంభమై వచ్చేనెల లో షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెప్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: