మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  సల్మాన్ ఖాన్ ,  సత్య దేవ్ ,  నయన తారమూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు. సత్యదేవ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ,  నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది.

మూవీ కి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ,  ట్రైలర్ మరియు కొన్ని పాటలను మరియు కొన్ని పోస్టర్ లను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అదిరిపోయే రేంజ్ లో నిర్వహించింది.

ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ మరో భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ఈవెంట్ ను దుబాయ్ లో నిర్వహించనున్నట్లు ,  ఆ ఈవెంట్ కి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా  విచ్చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి గాడ్ ఫాదర్ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: