తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన కార్తీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ తమిళంలో విరుమన్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో అదితి శంకర్ , ప్రకాష్ రాజ్ ,  రాజకిరణ్ ముఖ్య పాత్రలలో నటించగా ఎం ముత్తయ్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతికమూవీ ని నిర్మించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తమిళ భాషలో 12 ఆగస్ట్ 2022 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా ఈ రోజు నుండి అనగా సెప్టెంబర్ 30 వ తేదీ నుండి 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తెలుగు లో కూడా ఈ మూవీ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు లో ఈ మూవీ పసలపూడి వీరబాబు అనే టైటిల్ తో అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఓ టి టి' లో అందుబాటులోకి వచ్చింది. కార్తీ తాజాగా నటించిన ఈ సినిమా తెలుగులో నేరుగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: