అల్లు కుటుంబంలో అగ్ర హీరో గా ఉన్న అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరో గా నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ హీరో కి అసలు దక్కడం లేదు. ప్రస్తుతం ఓ రొమాంటిక్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అయన సిద్ధమయ్యాడు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో ఈ "ఉర్వశివో రాక్షసివో" అనే చిత్రం నిర్మించబడుతుంది. ఇప్పటిదాకా ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలు అందరిని ఎంతో ఆకట్టుకున్నాయి.

మీడియం రేంజ్ హీరోలతో మినిమమ్ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ఈ సంస్థ ఈ సినిమా పై మంచి అంచనాలే పెట్టుకుందని చెప్పొచ్చు. కొత్త జంట సినిమా తో పర్వాలేదనిపించుకునే హిట్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో చేసిన శ్రీరస్తు శుభమస్తు సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత అయన చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య చేఇస్నా ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలు ఆయనకు చేదు అనుభవాలని మిగిల్చాయని చెప్పాలి.

మంచి కాన్సెప్ట్ గా రూపొందిన ఈ సినిమా లు తప్పకుండా సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ అందుకుంటాయని భావించిన అల్లు శిరీష్ కు ఇది ఏమాత్రం కలిసి రాలేదు. ఇప్పుడు ఊర్వశివో.. రాక్షసీవో అనే మళ్ళీ తన అదృష్టాన్ని పరిఖించుకోవడానికి రాబోతుంది. ఈ చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ చేస్తుంది. మరి ఇద్దరికీ మంచి విజయం అవసరం అయిననేపథ్యంలో ఈ సినిమా ఇద్దరికీ ఎలాంటి విజయాన్ని తెచ్చు పెడుతుందో చూడాలి. ఈ సినిమా ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: