టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదలైతే చాలు తొలిరోజు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ కావాల్సిందే అనే సంగతి తెలిసిందే.అయితే కొన్నిరోజుల క్రితం వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల కోసం తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్నారు. అచ్చం కాలేజ్ కుర్రాడిలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్, కీరవాణి కలిసి ఫోటో దిగగా మీ పక్కన ఉన్న కాలేజీ కుర్రాడు ఎవరు సార్ అంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేయడం గమనార్హం. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఏఎం రత్నం నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.


అక్టోబర్ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. లుక్ మార్చుకున్న పవన్ కళ్యాణ్ తన కొత్త లుక్ తో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.నవ రాత్రులలో నవ ఉత్తేజం అంటూ కీరవాణి పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా నుంచి విడుదలైన పవర్ గ్లాన్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఇక హరిహర వీరమల్లు సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని నెటిజన్ల నుంచి అనేక రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వినోదాయ సిత్తం రీమేక్, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలలో ఏ సినిమా మొదట రిలీజవుతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పిక్ చూసి ఫ్యాన్స్ అయితే బాగా పండగ చేసుకుంటున్నారు. నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: