జాతీయ అవార్డు తీసుకున్న సూర్య.. పిక్స్ వైరల్?

కరోనా క్రైసిస్ లో తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగా అలరించాడో అందరికీ తెలిసిందే. ఫస్ట్ లాక్డౌన్ సమయంలో అయితే సూరైపొట్రూ (తెలుగులో ఆకాశం నీ హద్దురా) అంటూ అందరినీ కూడా ఎంతగానో ఆశ్చర్యపరిచాడు.ఇక అలాగే రెండో లాక్డౌన్ సమయంలో జై భీమ్ సినిమాతో ఎంతగానో మెప్పించాడు. ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సూర్య ప్రశంసలు అందుకున్నాడు. ఈ రెండు కూడా భారత్ తరుపున ఆస్కార్‌కు పంపించారు. కానీ చివరి పోరులో వెనక్కి వచ్చేశాయి. కానీ జాతీయ స్థాయిలో మాత్రం సూరారై పొట్రూ సినిమా అదరగొట్టేసింది. 2020లో విడుదలైన చిత్రాల్లో ఆకాశం నీ హద్దురా అదరగొట్టేసింది.జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడిగా, ఉత్తమ నిర్మాతగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇలా పలు కేటగిరీల్లో ఆకాశం నీ హద్దురా సినిమా అవార్డులను కొల్లగొట్టేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన ఈ అవార్డులను తాజాగా కేంద్రం అందజేసింది. 


రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలంతా కూడా అవార్డులను స్వీకరించారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు అందరూ హాజరయ్యారు. జంటగా సూర్య, జ్యోతిక అందరినీ కనువిందుచేశారు. ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నిర్మాతగా జ్యోతిక అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఆ తరువాత మన టాలీవుడ్ నుంచి కలర్ ఫోటో, నాట్యం వంటి సినిమాలకు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇప్పుడు మరోసారి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చర్చనీయాంశంగా మారింది. నేషనల్ లెవెల్లో ఇది బాగా ట్రెండ్ అవుతోంది. సూర్య, సూరైపొట్రూ హ్యాష్ ట్యాగ్‌లు మరోసారి జాతీయ స్థాయిలో తెగ వైరల్ అవుతున్నాయి. జూలైలో ఈ అవార్డులను ప్రకటించగా.. నేడు అందజేశారు. ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళికి అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: