హీరోయిన్ కేతికాశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆకాష్ పూరీ హీరోగా వచ్చిన రొమాంటిక్ చిత్రంతో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టింది. ఈ చిత్రంలో తన అంద చందాలతో కుర్రకారుకు గుబులు పుట్టించేలా చేసింది. అయితే ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయినా ఈ ముద్దుగుమ్మకు మాత్రం వరుస ఆఫర్లను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోని నాగశౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా అనే సినిమాలలో నటించింది. కానీ ఈ రెండు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కెరియర్ ప్రారంభంలోని వరుస ప్లాప్ లను చవి చూసింది కేతిక శర్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇక ఈమె కెరియర్ డేంజర్ జోన్ లో ఉందని చెప్పవచ్చు.కనీసం యువ హీరోలతోనైనా అవకాశాలు వస్తాయా అనుకుంటే ఈమె వైపు అసలు చూడలేదని టాక్ బాగా వినిపిస్తోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఆఫర్ల కోసం సోషల్ మీడియా వేదికగా తన అందాలను ప్రదర్శించడం లాంటివి చేస్తోంది. రెండు దుస్తులను ధరించి నెక్స్ట్ లెవెల్ లో గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ దుస్తుల్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. తన నడుము అందాలను మాత్రమే హైలెట్ చేస్తూ కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇచ్చిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు,  అభిమానులు సైతం కేతిక శర్మ మత్తెక్కించే చూపులతో మతి పోగొట్టే ఫోజులు ఇస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు . ఇక ఇలా కేతిక అందాలను పొగిడేస్తూ ఉన్నారు నేటిజెన్లు. మరి ఈసారైనా తను నటించే సినిమాల కథల ఎంపికలలో ఆచితూచి అడుగులు వేసి సరైన నిర్ణయాన్ని తీసుకుంటుందేమో చూడాలి మరి. ఈ ఫోటోలు చూసైనా సరే ఈ ముద్దుగుమ్మకు దర్శకులు సైతం అవకాశం కల్పిస్తారెమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: