‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ మెగా అభిమానులలో పెను సంచలనం సృష్టించింది. చిరంజీవిని మెగా అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా చిరంజీవి మెగా స్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీలో కనిపించడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ ట్రైలర్ ను చూసిన తరువాత పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కొంతమేర అసంతృప్తికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి.


ఈమూవీలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈమూవీలో సల్మాన్ చిరంజీవి లపై చిత్రీకరించిన సాంగ్ ఈమూవీకే హైలెట్ అంటున్నారు. దీనితో ఈమూవీ విడుదల గురించి మెగా అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక వింత కోరిక కలిగినట్లు తెలుస్తోంది. ‘గాడ్ ఫాదర్’ మూవీలో సల్మాన్ పాత్రను పవన్ కళ్యాణ్ చేత నటింపచేసి ఉంటే చాల బాగుండేది కదా అన్న ఆలోచన పవన్ అభిమానులలో వస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి చిరంజీవి పవన్ లు ఒక సినిమాలో కలిసి నటిస్తే చూడాలని ఎప్పటి నుండో పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.


గతంలో చిరంజీవి నటించిన ఒకటి రెండు సినిమాలలో పవన్ చిన్న అతిధి పాత్రలో మెరిసినప్పటికీ ఆ అతిధి పాత్రలో నటించడం పవర్ స్టార్ అభిమానులకు పెద్దగా సంతృప్తిని కలిగించలేదు. దీనితో చిరంజీవి పక్కన పవన్ ఒక కీలక పాత్రలో నటించే సినిమా వస్తే బాగుంటుందని ఎప్పటి నుండో పవన్ అభిమానులు కలలు కంటున్నారు. అయితే చిరంజీవి సినిమాల ఫంక్షన్స్ కు అదేవిధంగా మెగా స్టార్ ఇంట్లో జరిగే కుటుంబ సభ్యుల ఫంక్షన్స్ కు పవన్ హాజరు అవ్వడమే ఒక న్యూస్ గా మారుతున్న ప్రస్తుత పరిస్థితులలో అభిమానులు కోరుకుంటున్నట్లుగా చిరంజీవి పవన్ లు ఒకే సినిమాలో నటించే అవకాశం ఇప్పట్లో వస్తుందని అనుకోవడం పవర్ స్టార్ అభిమానులకు ఒక కలగానే మిగిలి పోతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  
మరింత సమాచారం తెలుసుకోండి: