ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ మూవీలోని ప్రభాస్ శ్రీరాముడి గెటప్ కు సంబంధించిన స్టిల్ విడుదల అయినప్పటికీ ఆస్టిల్ పై విపరీతమైన ట్రోలింగ్ జరగడం ప్రభాస్ అభిమానులను కలవర పెడుతున్నట్లు టాక్. శ్రీరాముడు గా ప్రభాస్ తన విల్లును పైకెత్తి పట్టుకుని తన లక్ష్యం వైపు గురి పెడుతున్న ఆఫోటోలో అనేక లోపాలు ఉన్నాయి అంటూ ప్రచారం మొదలైంది.


దేవుడు రూపాలైన శ్రీరాముడు శ్రీకృషుడు రూపాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియక పోయినప్పటికీ కేవలం రవి వర్మ చిత్రాలు ఆధారంగా మనకు శ్రీరాముడు శ్రీకృష్ణుడు రూపాల పై ఒక ఊహాజనితమైన అవగాహన ఉంది. దీనికితోడు మన సినిమాలలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు పాత్రలు ధరించిన హీరోలు ఎవరు మీసంతో కనిపించరు.


అయితే దీనికి భిన్నంగా దర్శకుడు ఓమ్ రౌత్ ‘ఆదిపురుష్’ మూవీలో ప్రభాస్ ను మీసాలతో శ్రీరాముడు గా చూపిస్తూ ఉండటంతో చాలామంది షాక్ అయ్యారు. ఈ స్టిల్ విడుదలైన కొద్ది గంటలలోనే వైరల్ గా మారినప్పటికీ ‘మీసాల శ్రీరాముడు’ అంటూ ప్రభాస్ లుక్ పై ట్రోలింగ్ ప్రారంభం అయింది. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని అల్లూరి గెటప్ కు సంబంధించిన స్టిల్ షేర్ చేస్తూ తమ హీరో అల్లూరి గెటప్ బాగుందా లేకుంటే ‘ఆదిపురుష్’ లో శ్రీరాముడి గెటప్ బాగుందా అంటూ కొందరు కామెంట్స్ కూడ పెడుతున్నారు.


వాస్తవానికి ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో ఎంతవరకు నప్పుతాడు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనితో అందరూ ఈమూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కోసం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య దేశవ్యాప్తంగా జరుగుతున్న దేవీనవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 2న ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ శ్రీరాముడి జన్మస్థలం అయిన అయోధ్యలో విడుదల చేస్తున్నారు. ఈ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహిస్తూ నేషనల్ మీడియాలో ఒక ప్రధాన అంశంగా మార్చబోతున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి: