గతకొంత కాలంగా టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్  చిరంజీవి రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటూ అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే  ఇక ఈ కాంబినేషన్ లో సినిమా మాత్రం రాలేదు.ఇకపోతే రాజమౌళి ఇప్పటికే పలువురు హీరోలతో సినిమాలను తెరకెక్కించినా సీనియర్ హీరోలతో సినిమాలను తెరకెక్కించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇక  గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళి అంటే నాకు చాలా ఇష్టమని చిరంజీవి తెలిపారు.

అయితే  జక్కన్న అంటే ఇష్టం ఉన్నా ఆయన డైరెక్షన్ లో నటించాలని లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు.ఇక  రాజమౌళి గ్రేట్ డైరెక్టర్ అని ప్రపంచానికి భారతీయ సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని తెలిపారని చిరంజీవి అన్నారు.కాగా  జక్కన్న ప్రతి విషయాన్ని లోతుగా చూస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే రాజమౌళి కోరుకునే ఔట్ పుట్ ను నటుడిగా నేను ఇస్తానో లేదో చెప్పలేనని ఆయన కామెంట్లు చేశారు.ఇక రాజమౌళి ఒక్కో సినిమాను తెరకెక్కించడానికి మూడు నుంచి ఐదేళ్ల పాటు శ్రమిస్తారని నేను ప్రస్తుతం ఒకే సమయంలో నాలుగు సినిమాలలో నటిస్తున్నానని

రాజమౌళి డైరెక్షన్ లో నటించి పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని నాకు లేదని ఆయన కామెంట్లు చేశారు.అంతేకాదు  నా టాలెంట్ కు నా కొడుకు రామ్ చరణ్ కొనసాగింపు అని చిరంజీవి వెల్లడించడం గమనార్హం.ఇక  చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇకపోతే  పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఇక చిరంజీకి ఈ సినిమాలో హీరోయిన్ లేదనే సంగతి తెలిసిందే. అయితే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: