తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీ విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఇదిలావుంటే ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకు వెళుతున్నారు.ఇక ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో గాడ్ ఫాదర్ విషయంలో మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా

 అనంతపురంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా  ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.అయితే భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అభిమానుల కేకలు కేరింతల నడుమ ఈ కార్యక్రమం మరింత రెట్టింపు ఉత్సాహంతో  మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా   ప్రీ రిలీజ్ జరిగిందని చెప్పాలి. ఈ సినిమా వేడుకను అనంతపురంలోనే కాకుండా ముంబైలో కూడా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కాగా సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా ఈ వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ సల్మాన్ ఖాన్ కి సెక్యూరిటీ ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ ముంబైలో కాకుండా దుబాయ్ లో నిర్వహించాలని మేకర్స్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే ఈ క్రమంలోనే ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడునున్నట్లు సమాచారం. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా విడుదల చేయనున్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు మరి అభిమానులు అంచనాలను మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చేరుకుంటారా..లేదా అనే విషయంపై అందరిలో ఎంతో ఆత్రుత ఏర్పడింది. ఈ చిత్రాన్ని మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: