నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక  రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు.తన చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. అయితే ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. కాగా రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది.ఇకపోతే తన కెరీర్ లో రష్మిక సీతా రామం చిత్రంతో ప్రయోగం చేసింది. స్టార్ స్టేటస్ పక్కన పెట్టి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇక సీతా రామం చిత్రం ఒక క్లాసికల్ బ్లాక్ బస్టర్ గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే.

రష్మిక పర్సనల్ వ్యవహారాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ఇదిలావుండగా కెరీర్ బిగినింగ్ లోనే రష్మికకి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.ఇక  కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఆమెకి నిశ్చితార్థం జరిగింది. అంతేకాదు పెళ్ళికి రెడీ అవుతున్న సమయంలో రష్మిక అతడి నుంచి విడిపోయింది.అయితే  వీరిద్దరి బ్రేకప్ సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది.ఇక  దీని నుంచి బయట పడి ఇద్దరూ వారి వారి కెరీర్స్ లో బిజీ అయ్యారు.అయితే  రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఇదిలావుంటే ఇక తాజాగా ఇంటర్వ్యూలో రష్మిక తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అయింది. అయితే తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ గురించి ప్రస్తావన రాగా రష్మిక షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

ఆమె... నా మాజీ బాయ్ ఫ్రెండ్స్ ని నేను ఇప్పటికీ మంచి స్నేహితులు లాగే భావిస్తాను. అంతేకాదు వారి ప్రస్తుతం పార్ట్నర్స్, ఫ్యామిలీని మీట్ అయ్యేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సమాధానం ఇచ్చింది.అంతేకాదు మాజీలతో ఫ్రెండ్ షిప్ కొనసాగించడం మంచి లక్షణం కాదు. నేను ఎవరికీ శత్రువుగా ఉండను అని రష్మిక పేర్కొంది. ప్రస్తుతం తన రిలేషన్ షిప్ స్టేటస్ పై మాట్లాడుతూ క్యూట్ కామెంట్స్ చేసింది.అయితే  చాలా కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రూమర్స్ ని రష్మిక, విజయ్ ఖండించలేదు అలాగని అంగీకరించలేదు.అంతేకాదు చెట్టాపట్టాలేసుకుని మాత్రం తిరుగుతున్నారు.ఇక  విజయ్ దేవరకొండతో మీ రిలేషన్ గురించి వస్తున్న రూమర్స్ పై ఎలా స్పందిస్తారు అని అడగగా ' వినడానికి చాలా క్యూట్ గా ఉంది' అంటూ బదులిచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: