మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కు తుంది . ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే చాలా కాలం అవుతుంది . ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది . ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రేణు దేశాయ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో రేణు దేశాయ్ ... హేమలత లవణం అనే పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే రేణు దేశాయికి సంబంధించిన ఒక వీడియోను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో రేణు దేశాయ్ అద్భుతమైన లుక్ లో కనిపించడంతో ఈ వీడియోకు ప్రేక్షకులు నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ వీడియో ద్వారా రేణు దేశాయ్ పాత్ర పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం మాత్రమే కాకుండా , ఈ మూవీ పై  కూడా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టైగర్ నాగేశ్వరరావు మూవీ లో హేమలత లవణం పాత్రలో నటిస్తున్న రేణు దేశాయ్ క్యారెక్టర్ చాలా కీలకం అని , ఈ మూవీ కే ఈ పాత్ర హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత రేణు దేశాయ్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ లో రవితేజ సరసన నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: