పవన్ కళ్యాణ్ కు తెలుగు లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కం బ్యాక్ లో రెండు బిగ్ హిట్స్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో త్వరలోనే ఓ చారిత్రాత్మక సినిమా ను చేయడానికి అయన సిద్ధమయ్యాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తొలిసారిగా రాబోతున్న పీరియాడిక్ చిత్రం కావడంతో ఈ సినిమా పై అందరు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. 'హరిహర వీరమల్లు' సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని అప్డేట్ లు కూడా వచ్చాయి.

పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా యొక్క టీజర్ కూడా విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో అది సినిమాపై మంచి బజ్ పెంచింది అని చెప్పాలి.  పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. చాలా రోజులుగా ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తప్పా వేరే సినిమా ను ఒప్పుకోలేదు. ఈ సినిమా తప్పకుండా తనకు మంచి అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆమె భావిస్తుంది. అయితే ఈ సినిమా యొక్క వర్క్ షాప్ నిర్వహించింది. కారణం ఏదైనా ఈ వర్క్ షాప్ కు పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, హీరోయిన్ నిధి అగర్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తదితరులు హాజరయ్యారు.

సినిమా మళ్ళీ ఆగిపోయింది అని వస్త్తున్న వార్తలకు ఈ అప్డేట్ చెక్ పెట్టినట్లు అయ్యిందని చెప్పాలి. ఈ వర్క్ షాప్ లో ఇప్పటివరకు పూర్తయిన చిత్రీకరణ, తదుపరి షెడ్యూల్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మరి త్వరలోనే మొదలు కాబోతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ను మొదలుపెట్టి వచ్చే ఏడాది విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడికి, హీరో కి, హీరోయిన్ కి ఈ సినిమా ఎంతో ముఖ్యమైన నేపథ్యంలో ఈ చిత్రం వారికి ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: