దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా యొక్క షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కూడా ఈ సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్ పనులు ఎక్కువగా ఉండడంతో అవి పూర్తి చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యొక్క విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో తాజాగా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రభాస్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ లుక్ మెజారిటీ ప్రేక్షకులను అలరించింది.

దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా, ఆయనకు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ నటి కృతిసనన్ నటిస్తోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖీన్ నటిస్తున్నారు. ఇది దేశం మొత్తాన్ని ఎంతో ఆసక్తి పరిచే విషయమని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే కాలంలో ఇలాంటి సినిమాలు వచ్చింది చాలా తక్కువ. చాలా రోజుల తర్వాత ఈ తరహా సినిమా వస్తుంది. అయితే ఇది ఎంతవరకు ఈ జనరేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేదే ఇక్కడ అసలు విషయం.

ఇక తాజాగా వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లో ప్రభాస్ రాముడిగా నింగికి విల్లు ఎక్కుపెట్టి పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది ప్రభాస్ అభిమానులను ఎంతో కిక్ ఇచ్చే లుక్ అని చెప్పాలి. అయితే దీన్ని రామ్ చరణ్ విల్లు పట్టుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని పోస్టర్ తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియా లో వార్ చేసుకుంటున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. అయితే అక్టోబర్ 2 రాత్రి 7.11 గంటలకు అయోధ్యలోని సరయు నది ఒడ్డున టీజర్ విడుదల చేయడానికి యూనిట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: