ప్రభాస్ హీరో గా ఇప్పుడు పలు సినిమాలు రూపొందుతున్నాయి. అందులో ఒకటి ప్రాజెక్ట్ కే. ఫ‌లితం ఎలా ఉన్నా ప్ర‌భాస్ మాత్రం వ‌రుసగా సినిమాల‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ఆయనకు వచ్చిన స్టార్ డమ్ ను ఉపయోగించుకోలేకపోయాడు. చేసిన రెండు సినిమాలు భారీగా నిరాశపరిచాయి. అలా ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్‌ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. దాంతో ఈ సారి సూపర్ హిట్ కొట్టాలని అయన ఫ్యాన్స్ కోరుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న మూడు సినిమాల‌ను సెట్స్‌పైన ఉంచాడు.

ఆది పురుష్ సినిమా ఇప్పటికే విడుదలకు సిద్ధం కాగా, మరొకటి సలార్. ఈ రెండు సినిమాల షూటింగ్ లు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ‘ప్రాజెక్ట్‌-K’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ‘మ‌హాన‌టి’ ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతుంది. అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర లో నటిస్తూ ఉండగా, దీపికా పడుకొనే హీరోయిన్ నటిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్రేక్ లు వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఇతర సినిమాల షూటింగ్ ల కోసం ప్రభాస్సినిమా ను వాయిదా వేశాడు.

ఇప్పుడు అది పురుష్ సినిమా ప్రమోషన్స్ కోసం, అలాగే సలార్ సినిమా షూటింగ్ కోసం ఈ సినిమా ను పక్కన పెట్టబోతున్నాడట. సై-ఫై జాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఫ్యూచ‌ర్ గురించి ఉంటుంద‌ని, వ‌ర‌ల్డ్ వార్-3 టైమ్ లైన్‌లో ఈ సినిమా జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. ఏదేమైనా ఈ మూడు భారీ పాన్ ఇండియా సినిమా లతో తప్పకుండా ఈ హీరో భారీ విజయం అందుకోవడం ఖాయం అని చెప్పొచ్చు. ఇకపోతే ఆది పురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంటే సలార్ సెప్టెంబర్ లో విడుదల అవుతుంది. మధ్యలో మారుతీ సినిమా ను చేసి విడుదల చేయాలనీ భావిస్తున్నాడు. ఆ తర్వాత 2024 లో ప్రాజెక్ట్ కే సినిమా ను విడుదల చేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: