తెలుగులో నయనతార కు ఏ స్థాయి లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాదిలోనే ఆమె అగ్ర హీరోయిన్ కాబట్టి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది ఆమెకు. అలా ఆమె ఇప్పుడు తెలుగు లో చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్ ఫాదర్‌’. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ అయినా ఈ సినిమా అక్టోబరు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందునుంచి ఈ సినిమా పై ఇన్ని అంచనాలు ఏర్పడ్డాయంటే ఇందులో నయనతార నటించడమే.

ఆమె హీరోయిన్ గా కాకుండా ఓ కీలక పాత్రలో ఈ సినిమా లో నటించడం ఆమె అభిమానులలో ఆసక్తిని కలిగిస్తుంది.  సత్యప్రియ జైదేవ్‌గా ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర ఆమెను మరికొన్నేళ్లు ప్రేక్షకులు గుర్తుండేలా చేస్తుంది అందడంలో ఎలాంటి సందేహం లేదు అని చిత్ర బృందం చెబుతుంది.  ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకలో నయనతార మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో ఆమె నటించిన తీరుకు ప్రేక్షక లోకం దాసోహం అయ్యింది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది.

సినిమా పై అంచనాలు కూడా పెంచేశాయి. చాలారోజుల తరవాత చిరంజీవి ఓ పొలిటిక‌ల్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని భావిస్తున్నారు. ఇక  ఈ చిత్రంలో మరో స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. చిరు తో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న అయన ఓ పాట లో కూడా స్టెప్ లు వేశాడు. అయన మాత్రమే కాకుండా  టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, స‌ముద్ర‌ఖ‌ని, సునీల్‌, స‌త్య‌దేవ్‌, కీ రోల్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా ను కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై గాడ్ ఫాద‌ర్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: