తెలుగు నాట మంచి గుర్తింపు కలిగిన తమిళ హీరోలలో ఒకరు విక్రమ్. ఆయన డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా కూడా ఎందుకో అయన ఆ విధంగా సినిమా చేయడం లేదు. కారణం ఏదైనా అయన తన అభిమానులను ఇలా నిరాశపరుస్తున్నాడు అనే చెప్పాలి. తాజాగా అయన రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కోబ్రా సినిమా విడుదలై మంచి విజయం సాధించగా తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమా కూడా విడుదల అయ్యింది. దేశం గర్వంచదగ్గ దర్శకుల్లో ఒకరైన మణి రత్నం ఈ సినిమా కి దర్శకత్వం వహించగా ఈ సినిమా అయన డ్రీం ప్రాజెక్ట్ అని మొదటినుంచి అందరు చెప్పే మాట.

దానికి తగ్గట్లుగానే ఈ సినిమా ను చేశాడు మణిరత్నం. బాహుబలి సినిమా కి పోటీగా ఈ సినిమా రూపొందించగా పలు మిక్స్డ్ టాక్స్ మధ్య ఈ సినిమా రన్ అవుతుంది. తమిళనాట మాత్రం ఈ సినిమా కి మంచి పేరొచ్చింది. మణిరత్నం ఏ సబ్జెక్ట్ తీసుకున్న దాన్ని అద్భుతంగా తెరకెక్కించడం అయన శైలి. ఇప్పటిదాకా సాంఘీక , ప్రేమకథ సినిమాలను చేసిన ఈ దర్శకుడు తొలిసారిగా చారిత్రాత్మక సినిమా ను టచ్ చేశాడని చెప్పాలి. మణిరత్నం 40 యేళ్ల  కెరీర్‌లో కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవలను సినిమాగా తెరకెక్కించాలన్నది జీవిత కాలపు కల అది ఇప్పుడు నెరవేరింది.

అయితే ఈ సినిమా అంతా బాగానే ఉన్నా కూడా విక్రమ్ పోర్షన్ చాలా తక్కువుగా ఉండడం అయన అభిమానులను ఏమాత్రం మెప్పించడం లేదు. గట్టిగ చూస్తే ఈ సినిమా విక్రమ్ పదినిమిషాలు కనిపిస్తాడు. అనవసరంగా ఈ సినిమా ను విక్రమ్ ఒప్పుకున్నాడు అని కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ సినిమా లో కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ వంటి భారీ తారాగణం నటించింది. ఐశ్వర్య రాయ్ ఈ సినిమా లో ఒక మంచి విలన్ పాత్ర పోషించింది అని చెప్పొచ్చు.   క్లైమాక్స్‌లో వచ్చే సముద్రపు సన్నివేశాలను ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ముఖ్యంగా నవల చదివ వాళ్లు బాగానే కనెక్ట్ అవుతారు. కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు ఏ మేరకు కనెక్ట్ అవుతారనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: